Exodus 28:35 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
సేవచేయునప్పుడు అహరోను దాని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించునప్పుడు అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అహరోను యాజకునిగా పని చేసేటప్పుడు ఈ అంగీని ధరించి, యెహోవా ఎదుట పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. అతడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటప్పుడు గంటలు మోగుతాయి. ఈ విధంగా అహరోను మరణించడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సేవచేయునప్పుడు అహరోను దాని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించు నప్పుడు అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడవలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అహరోను సేవ చేస్తున్నప్పుడు అతడు దీనిని ఖచ్చితంగా ధరించాలి. అతడు యెహోవా సన్నిధికి పరిశుద్ధాలయంలోకి వెళ్లినప్పుడు బయటకు వచ్చినప్పుడు అతడు చనిపోలేదు అని గ్రహించేలా ఆ గంటల శబ్దం తెలియజేస్తుంది.