Exodus 28:4 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
పతకము ఏఫోదు నిలువు టంగీ విచిత్ర మైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై యుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ మనుష్యులు చేయాల్సిన బట్టలు ఇవే: న్యాయతీర్పు వస్త్రం ఏఫోదు, చేతుల్లేని ఒక ప్రత్యేక అంగీ, తల కప్పుకొనే బట్ట, ఒక నడికట్టు పట్టి నీ సోదరుడైన అహరోనుకు, అతని కుమారులకోసం ఆ మనుష్యులు ఈ ప్రత్యేక దుస్తులను తయారు చేయాలి. అప్పుడు అహరోను, అతని కుమారులు యాజకులుగా నన్ను సేవించవచ్చు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పతకము ఏఫోదు నిలువు టంగీ విచిత్రమైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడైయుండునట్లువారు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు తయారుచేయవలసిన వస్త్రాలు ఇవే: రొమ్ము పతకం, ఏఫోదు, నిలువుటంగీ, అల్లిన చొక్కా, తలపాగా, నడికట్టు. నాకు యాజకులుగా సేవ చేయడానికి నీ సోదరుడైన అహరోనుకు అతని కుమారులకు ఈ పవిత్ర వస్త్రాలను తయారుచేయాలి.