Exodus 29:46 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కావున నేను వారి మధ్య నివసించునట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహో వాను నేనే అని వారు తెలిసికొందురు. నేను వారి దేవుడనైన యెహోవాను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
‘నేనే యెహోవాను, వారి దేవుడ్ని’, అని ప్రజలు తెలుసుకొంటారు. నేను వారితో నివసించేందుకు వారిని ‘ఈజిప్టునుండి బయటికి రప్పించింది నేనే’ అని వారు తెలుసుకొంటారు. నేనే వారి దేవుడైన యెహోవాను.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కావున నేను వారి మధ్య నివసించునట్లు ఐగుప్తు దేశములోనుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలిసికొందురు. నేను వారి దేవుడనైన యెహోవాను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను వారి మధ్య నివసించేలా, వారిని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చిన వారి దేవుడనైన యెహోవాను నేనేనని వారు తెలుసుకుంటారు. నేను వారి దేవుడనైన యెహోవాను.