Exodus 32:30 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవాయొద్దకు కొండ యెక్కి వెళ్లెదను; ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మర్నాటి ఉదయం ప్రజలందరికి మోషే, “మీరు భయంకర పాపం చేసారు. అయితే ఇప్పుడు నేను యెహోవా దగ్గరకు పైకి వెళ్తాను. ఆయన మీ పాపం విషయం మిమ్మల్ని క్షమించేందుకు నేనేమైనా చేయగలనేమో” అని చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరునాడు మోషే ప్రజలతో–మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవాయొద్దకు కొండ యెక్కి వెళ్లెదను; ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ మరునాడు మోషే ప్రజలతో, “మీరు ఘోరమైన పాపం చేశారు. కాని నేను యెహోవా దగ్గరకు ఎక్కి వెళ్తాను; బహుశ మీ పాపాల కోసం నేనేమైనా ప్రాయశ్చిత్తం చేయగలనేమో” అని అన్నాడు.