Ezekiel 11:16 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపుముప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా దూరముననున్న అన్యజనులలోనికి నేను వారిని తోలివేసినను, ఆ యా దేశములలో వారిని చెదరగొట్టి నను, వారు వెళ్ళిన ఆ యా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“కావున ఈ విషయాలు ఆ ప్రజలకు తెలియ జేయుము, మన ప్రభువైన యెహోవా చెప్పున దేమంటే, ‘నా ప్రజలు దూరదేశాలకు తరలిపోయేలా నేను ఒత్తిడి చేసిన మాట నిజమే. అనేక దేశాలలో నివసించేలా వారిని చెల్లా చెదురు చేశాను. అయినా వాళ్ళు ఆ దేశాలలో ఉన్నప్పుడు కొద్దికాలం నేనే వారి ఆలయమై ఉంటాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా దూరముననున్న అన్యజనులలోనికి నేను వారిని తోలివేసినను, ఆయా దేశములలో వారిని చెదరగొట్టినను, వారు వెళ్లిన ఆయా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“కాబట్టి వారికి ఈ మాట ప్రకటించు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: దూరంగా ఉన్న జాతుల మధ్యకు నేను వారిని పంపినా, దేశాల మధ్య వారిని చెదరగొట్టినా వారు వెళ్లిన దేశాల్లో కొంతకాలం వారికి నేను పరిశుద్ధాలయంగా ఉన్నాను.’