Ezekiel 12:19 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దేశములోని జనులకీలాగు ప్రకటించుముయెరూషలేము నివాసులనుగూర్చియు ఇశ్రాయేలు దేశమునుగూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా దానిలో నున్న కాపురస్థులందరును చేసిన బలాత్కారమునుబట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారము తిందురు భయభ్రాంతితో నీళ్లు త్రాగు దురు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ విషయాలు నీవు సామాన్య ప్రజలకు తెలియజెప్పాలి. నీవు ఇలా అనాలి: ‘యెరూషలేము ప్రజలకు, ఇశ్రాయేలులో ఇతర ప్రాంతాల ప్రజలకు మన ప్రభువైన యెహోవా చేపుతున్నాడు, మీరు మీ ఆహారం తీసుకొనేటప్పుడు మిక్కిలి కలత చెందుతారు. మీరు నీరు తాగేటప్పుడు. భయకంపితులవుతారు. ఎందువల్లనంటే, మీ దేశంలో అన్ని వస్తువులూ సర్వనాశనం చేయబడతాయి! అక్కడ నివసిస్తున్న ప్రజలందరి పట్ల శత్రువు చాలా క్రూరంగా ప్రవర్తిస్తాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దేశములోని జనులకీలాగు ప్రకటించుము–యెరూషలేము నివాసులనుగూర్చియు ఇశ్రాయేలుదేశమునుగూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా — దానిలో నున్న కాపురస్థులందరును చేసిన బలాత్కారమునుబట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారము తిందురు భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేశంలోని ప్రజలకు ఇలా చెప్పు: ‘యెరూషలేములో ఇశ్రాయేలు దేశంలో నివసిస్తున్నవారి గురించి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అక్కడ నివసించే వారందరు చేసే హింస కారణంగా వారి దేశంలోని ప్రతిదీ తీసివేయబడుతుంది. కాబట్టి వారు ఆందోళనలో తమ ఆహారాన్ని తింటారు నిరాశతో నీరు త్రాగుతారు.