Ezekiel 13:20 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడునేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధములచేత మీరు దుఃఖింపజేయుదురు, దుర్మార్గులు తమ దుష్‌ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించు కొనకుండ మీరు వారిని ధైర్యపరతురు గనుక
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కావున ప్రభువైన యెహోవా ఈలాగు చెబుతున్నాడు, మీరు బట్టతో కంకణాలు కట్టి ప్రజలను చిక్కించుకుంటున్నారు. కాని నేనా ప్రజలను విడుదల చేస్తాను. ఆ కంకణాలు మీ చేతుల నుండి లాగి పారవేస్తాను. అప్పుడు ప్రజలు మీ నుండి విముక్తి పోందుతారు. పంజరంలో నుండి ఎగిరిపోయే పక్షుల్లా వారు వుంటారు!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధములచేత మీరు దుఃఖింపజేయుదురు, దుర్మార్గులు తమ దుష్‌ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించు కొనకుండ మీరు వారిని ధైర్యపరతురు గనుక
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: మీరు పక్షులకు వల వేసినట్లు ప్రజల ప్రాణాలకు వల వేయడానికి ఉపయోగించే మీ మంత్రాలకు నేను వ్యతిరేకిని. నేను వాటిని మీ చేతుల నుండి తెంపివేస్తాను; పక్షులను పట్టినట్లు వలవేసి మీరు పట్టిన ప్రజలను విడిపిస్తాను.