Ezekiel 16:13 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఈలాగు బంగారుతోను వెండితోను నేను నిన్ను అలంకరించి, సన్నపు అవిసె నారయు పట్టును విచిత్రపు కుట్టుపనియుగల బట్టలును నీకు ధరింపజేసి, గోధుమలును తేనెయు నూనెయు నీ కాహారముగా ఇయ్యగా, నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృధ్ధి నొందితివి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నీవు ధరించిన వెండి బంగారు ఆభరణాలలోను, నార, పట్టు, కుట్టుపని వస్త్రాలలోను నీవు ఎంతో అందంగా కన్పించావు. నీవు మిక్కిలి విలువైన ఆహారం తిన్నావు. నీవు మహా సౌందర్యవతివయ్యావు. నీవు రాణి వయ్యావు!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఈలాగు బంగారుతోను వెండితోను నేను నిన్ను అలంకరించి, సన్నపు అవిసె నారయు పట్టును విచిత్రపు కుట్టుపెనియుగల బట్టలును నీకు ధరింపజేసి, గోధుమలును తేనెయు నూనెయు నీ కాహారముగా ఇయ్యగా, నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృద్ధి నొందితివి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇలా నిన్ను బంగారం, వెండితో అలంకరించి, సన్నని నార కుట్టుపని ఉన్న ఖరీదైన పట్టు వస్త్రాలు నీకు ధరింపజేశాను. నీకు ఆహారంగా తేనె, ఒలీవనూనె నాణ్యమైన పిండి ఇవ్వగా నీవు చాలా అందంగా తయారయ్యావు, ఒక రాణిగా ఎదిగావు.