Ezekiel 16:33 — Compare Translations

3 translations compared side by side

Telugu (BSI) 1880
నీ విటకాండ్రు నలుదిక్కులనుండి వచ్చి నీతో వ్యభిచరించునట్లు వారికందరికి నీవే సొమి్మచ్చుచు వచ్చి తివి, బహుమానముల నిచ్చుచు వచ్చితివి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వేశ్యలలో అధిక సంఖ్యాకులు తమ కోర్కె తీర్చుకొనే పురుషులను డబ్బు ఇమ్మని పీడిస్తారు. కాని నీవు మాత్రం అనేకంగా వున్న నీ విటులకు నీ బహుమానాలను, డబ్బును ఇచ్చావు. నీతో వ్యభిచరించడానికి చుట్టూవున్న పురుషులకు డబ్బిచ్చావు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వేశ్యలందరూ బహుమతులు తీసుకుంటారు, కానీ నీ ప్రేమికులందరికీ నీవు ఎదురు బహుమతులు ఇస్తావు, నీతో వ్యభిచారం చేయడం కోసం ఎక్కడి నుండైనా నీ దగ్గరకు రావాలని వారికి లంచం ఇస్తావు.