Ezekiel 16:34 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నీ జారత్వ మునకును ఇతర స్త్రీల జారత్వమునకును భేదమేమనగా వ్యభిచరించుటకు ఎవడైనను నీ వెంట తిరుగుటయు లేదు, నీకు పడుపుసొమి్మచ్చుటయు లేదు, నీవే యెదురు జీత మిచ్చితివి, ఇదే నీకును వారికిని కలిగిన భేదము; ఇదే యెహోవా వాక్కు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
చాలా మంది వేశ్యలకన్నా నీవు భిన్నంగా వున్నావు. చాలా మంది వేశ్యలు పురుషులను డబ్బు ఇమ్మని బాధిస్తారు. కాని నీవు మాత్రం నిన్ను పొందమని నీ విటులకు డబ్బు ఎదురిస్తున్నావు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీ జారత్వమునకును ఇతర స్త్రీల జారత్వమునకును భేదమేమనగా వ్యభిచరించుటకు ఎవడైనను నీ వెంట తిరుగుటయు లేదు, నీకు పడుపుసొమ్మిచ్చుటయు లేదు, నీవే యెదురు జీత మిచ్చితివి, ఇదే నీకును వారికిని కలిగిన భేదము; ఇదే యెహోవా వాక్కు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి నీ వ్యభిచారంలో నీకు ఇతరులకు తేడా ఉంది; నీతో వ్యభిచరించడానికి ఎవరూ నీ వెంట పడరు. నీవు డబ్బులు తీసుకోవు కాని తిరిగి నీవే వారికి ఇస్తావు కాబట్టి నీవు చాలా భిన్నమైనదానివి.