Ezekiel 17:12 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
తిరుగుబాటుచేయు వీరితో ఇట్లనుముఈ మాటల భావము మీకు తెలియదా? యిదిగో బబులోనురాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని, తనయొద్ద నుండు టకై బబులోనుపురమునకు వారిని తీసికొనిపోయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ఇశ్రాయేలు ప్రజలకు ఈ కథ వివరించు. ఇశ్రాయేలీయులు ఎల్లప్పుడూ నాపై తిరుగుబాటు చేస్తూవున్నారు. వారికి ఈ విషయాలు వివరించు. మొదటి పక్షిరాజు నెబుకద్నెజరు. అతడు బబులోను (బాబిలోనియా) రాజు. అతడు యెరూషలేముకు వచ్చి రాజును, ఇతర పెద్దలను తీసుకొని పోయాడు. వారిని బబులోనుకు తీసుకొని వెళ్లాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–తిరుగుబాటుచేయు వీరితో ఇట్లనుము–ఈ మాటల భావము మీకు తెలియదా? యిదిగో బబులోనురాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని, తనయొద్ద నుండుటకై బబులోనుపురమునకు వారిని తీసికొనిపోయెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“తిరుగుబాటు చేసే ఈ ప్రజలతో ఇలా చెప్పు, ‘ఈ మాటల అర్థం మీకు తెలియదా?’ ఇదిగో, ‘బబులోను రాజు యెరూషలేముకు వెళ్లి దాని రాజును, అధిపతులను పట్టుకుని తనతో పాటు బబులోనుకు తీసుకువచ్చాడు.