Ezekiel 17:22 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడుఎత్తయిన దేవదారువృక్షపు పైకొమ్మ యొకటి నేను తీసి దాని నాటుదును, పైగా నున్నదాని శాఖలలో లేతదాని త్రుంచి అత్యున్నతపర్వతముమీద దాని నాటు దును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “పిమ్మట ఎత్తైన దేవదారు వృక్షపు కొమ్మనొకటి నేను తీసుకొంటాను. వృక్షపు పైభాగాన్నుండి ఒక చిన్న రెమ్మను తీసుకొంటాను. నేనే దానిని చాలా ఎత్తైన పర్వతం మీద నాటుతాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–ఎత్తయిన దేవదారువృక్షపు పైకొమ్మ యొకటి నేను తీసి దాని నాటుదును, పైగా నున్నదాని శాఖలలో లేతదాని త్రుంచి అత్యున్నతపర్వతముమీద దాని నాటుదును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఎత్తైన దేవదారు చెట్టులో చిటారు కొమ్మ ఒకటి తీసి దానిని నాటుతాను; దాని పైనున్న కొమ్మల్లో ఒక లేత కొమ్మను త్రుంచి అత్యున్నత పర్వతం మీద నాటుతాను.