Ezekiel 17:8 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
కావున నీవీలాగు ప్రకటింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా అట్టి ద్రాక్షావల్లి వృద్ధినొందునా?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సారవంతమైన భూమిలో నాటబడింది ద్రాక్షామొక్క. మంచి నీటివనరు వున్నచోట నాట బడింది. దాని కొమ్మలు బాగా పెరిగి, కాపు కాయవలసి ఉంది. అది ఎంతో మేలురకం ద్రాక్షాలత అయివుండేది.’”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[8-9] కావున నీవీలాగు ప్రకటింపుము —ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–అట్టి ద్రాక్షావల్లి వృద్ధినొందునా? అది యెండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతురు, దాని చిగుళ్లు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్లు ఇక చిగిరింపవు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ ద్రాక్షావల్లికి తీగెలు వచ్చి, పండ్లు ఇచ్చేలా, అద్భుతమైన ద్రాక్షవల్లిలా అయ్యేలా, అది మంచి నేలలో విస్తారమైన నీటి ప్రక్కన నాటబడింది.’