Ezekiel 19:14 — Compare Translations

3 translations compared side by side

Telugu (BSI) 1880
దాని పండ్లను దహించుచున్నది గనుక రాజ దండమునకు తగిన గట్టిచువ్వ యొకటియు విడువబడ లేదు. ఇదియే ప్రలాపవాక్యము, ఇదియే ప్రలాపము నకు కారణమగును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దాని పెద్ద కొమ్మ నుండి నిప్పు చెలరేగింది. నిప్పు దాని రెమ్మలను, పండ్లను నాశనం చేసింది. అందుచే బలమైన చేతికర్రగా లేదు; రాజదండముగా లేదు’ ఇది ఒక విషాద గీతం. అది వినాశనాన్ని గూర్చి పాడబడింది.”
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దాని కొమ్మల్లో నుండి అగ్ని వ్యాపించి దాని పండ్లను కాల్చివేసింది. పాలకుల రాజదండాన్ని చేయడానికి తగిన బలమైన కొమ్మ ఒక్కటి కూడా మిగల్లేదు.’ ఇదే విలాప వాక్యం; దీనినే విలాప గీతంగా పాడతారు.”