Ezekiel 20:23 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మరియు వారు నా విధుల ననుసరింపక నా కట్టడలను తృణీకరించి, నేను విధించిన విశ్రాంతిదినములను అపవిత్ర పరచి,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అందువల్ల ఎడారిలో వారికి నేను ఇంకొక మాట చెప్పాను. వారిని ఇతర రాజ్యాలలోకి చెదరగొడతాననీ, వారిని అనేక దేశాలకు పంపించి వేస్తాననీ చెప్పాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[23-24] మరియు వారు నా విధుల ననుసరింపక నా కట్టడలను తృణీకరించి, నేను విధించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచి, తమపితరులు పెట్టుకొనిన విగ్రహములను పూజింప గోరగా, అన్యజనులలో వారిని చెదరగొట్టి సకలదేశములలోనికి వారిని వెళ్లగొట్టుదునని ప్రమాణము చేసితిని.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు నా ధర్మశాస్త్రానికి లోబడకుండా నా శాసనాలను తృణీకరించి నా సబ్బాతును అపవిత్రపరచి తమ తండ్రులు పెట్టిన విగ్రహాలను పూజించారు, కాబట్టి నేను వారిని ఇతర ప్రజలమధ్య చెదరగొట్టి అన్ని దేశాలకు వారిని చెదరగొడతానని అరణ్యంలో వారికి ప్రమాణం చేశాను.