Ezekiel 21:28 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మరియు నరపుత్రుడా, నీవు ప్రవచించి ఇట్లనుము అమ్మోనీయులనుగూర్చియు, వారు చేయు నిందను గూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాహతము చేయుటకు ఖడ్గము ఖడ్గమే దూయబడియున్నది, తళతళలాడుచు మెరుగుపెట్టిన ఖడ్గము వధచేయుటకు దూయబడియున్నది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవుడు ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, నా తరపున ప్రజలతో మాట్లాడు. ఈ విషయాలు చెప్పు: ‘అమ్మోను ప్రజలకు, వారి సిగ్గుచేటు దేవతకు నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “‘చూడండి, ఒక ఖడ్గం! ఆ ఖడ్గం దాని ఒరనుండి బయటకు వచ్చింది. కత్తి మెరుగు దిద్దబడింది! కత్తి సంహారానికి సిద్ధంగా ఉంది. అది మెరుపు తీగలా ప్రకాశించటానికి మెరుగు దిద్దబడింది!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు నరపుత్రుడా, నీవు ప్రవచించి ఇట్లనుము —అమ్మోనీయులనుగూర్చియు, వారుచేయు నిందనుగూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా— హతము చేయుటకు ఖడ్గము ఖడ్గమే దూయబడియున్నది, తళతళలాడుచు మెరుగుపెట్టిన ఖడ్గము వధచేయుటకు దూయబడియున్నది.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“మనుష్యకుమారుడా! నీవు ప్రవచించి ఇలా చెప్పు, ‘అమ్మోనీయుల గురించి వారి అవమానాల గురించి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘ఒక ఖడ్గం, ఒక ఖడ్గం, వధ కోసం దూయబడింది, నాశనం చేయడానికి మెరుగు పెట్టబడి, మెరుపులా తళతళలాడుతూ ఉంది!