Ezekiel 22:12 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో నున్నారు, అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంత ముగా వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఓ యెరూషలేము ప్రజలారా, నరహత్య చేయటానికి మీరు డబ్బు తీసుకొంటారు. మీరు డబ్బు అప్పు ఇచ్చి, దానిమీద వడ్డీ తీసుకుంటారు. స్వల్ప లాభం కోసం మీరు మీ పొరుగువారిని మోసగిస్తారు. మీరు నన్ను మర్చిపోయారు.’” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో నున్నారు, అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీలో రక్తం చిందించడానికి లంచాలు తీసుకునే వ్యక్తులు ఉన్నారు; నీవు వడ్డీ తీసుకుని పేదల నుండి లాభం పొందుతావు. నీవు నీ పొరుగువారి నుండి అన్యాయమైన లాభం పొందుతావు. నీవు నన్ను మరచిపోయావు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.