Ezekiel 23:24 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆయుధములు పట్టుకొని చక్రములుగల రథములతోను గొప్ప సైన్యముతోను వారు నీమీదికి వచ్చి, కేడెములను డాళ్లను పట్టుకొని శిరస్త్రాణములు ధరించుకొని వారు నీమీదికి వచ్చి నిన్ను చుట్టుకొందురు, వారు తమ మర్యాదచొప్పున నిన్ను శిక్షించునట్లు నేనునిన్ను గూర్చిన తీర్పు వారికప్పగింతును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ గుంపంతా నీ వద్దకు వస్తుంది. తమ గుర్రాలమీద, రథాలమీద వారు వస్తారు. అనేకానేకమంది వస్తారు. వారు తమ ఈటెలను, డాళ్లను, శిరస్త్రాణములను ధరించి వస్తారు. వారంతా నీ చూట్టూ గుమిగూడతారు. నీవు నాకు చేసినదంతా వారికి నేను వివరిస్తాను. వారికి ఇష్టమైన రీతిలో వారు నిన్ను శిక్షిస్తారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయుధములు పట్టుకొని చక్రములుగల రథములతోను గొప్ప సైన్యముతోను వారు నీమీదికి వచ్చి, కేడెములను డాళ్లను పట్టుకొని శిరస్త్రాణములు ధరించుకొని వారు నీమీదికి వచ్చి నిన్ను చుట్టుకొందురు, వారు తమ మర్యాదచొప్పున నిన్ను శిక్షించునట్లు నేను నిన్నుగూర్చిన తీర్పు వారికప్పగింతును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు ఆయుధాలతో రథాలతో బండ్లతో జనసమూహంతో నీ మీదికి వస్తారు. పెద్ద డాళ్లు, చిన్న డాళ్లు, శిరస్త్రాణాలు ధరించి అన్ని వైపుల నుండి నిన్ను చుట్టుముడతారు. శిక్షించడానికి నేను నిన్ను వారికి అప్పగిస్తాను, వారు తమ పద్ధతిలో నిన్ను శిక్షిస్తారు.