Ezekiel 23:35 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడునీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును రావల సిన శిక్షను నీవు భరించెదవు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“కావున నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, ‘యెరూషలేమా నీవు నన్ను మర్చి పోయావు. నన్ను దూరంగా విసరివేసి, నన్ను వెనుక వదిలావు. నీవు నన్ను వదిలి వేశ్యలా జీవించిన కారణంగా ఇప్పుడు నీవు బాధ అనుభవిస్తావు. నీ అపవిత్రమైన కలలకూ నీ వ్యభిచారానికి నీవు శ్రమననుభవించాలి.’”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును రావలసిన శిక్షను నీవు భరించెదవు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నీవు నన్ను మరచిపోయి నాకు వెన్ను చూపావు, నీ అశ్లీల ప్రవర్తనకు వ్యభిచారానికి తగిన శిక్షను నీవు భరించాలి.”