Ezekiel 23:37 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
వారు వ్యభిచారిణులును నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి, నాకు కనిన కుమారులను విగ్రహములు మింగునట్లు వారిని వాటికి ప్రతిష్టించిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వారు వివాహబంధం తెంచుకొని వ్యభిచరించారు. వారిపై హత్యానేరం ఉంది. వారు వేశ్యల్లా ప్రవర్తించారు. వారి అపవిత్ర విగ్రహాలతో వుండటానికి వారు నన్ను వదిలివేశారు. నా పిల్లలు వారితో వున్నారు. కాని వారిని నిప్పులో బలవంతంగా నడిపించింది. తమ అపవిత్ర విగ్రహాలకు నైవేద్యం పెట్టటానికి వారీ పని చేశారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు వ్యభిచారిణులును నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి, నాకు కనిన కుమారులను విగ్రహములు మ్రింగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు వ్యభిచారులు, వారి చేతికి రక్తం అంటింది. వారు విగ్రహాలతో వ్యభిచరించారు; నాకు కన్న బిడ్డలను వారు విగ్రహాలకు ఆహారంగా అర్పించారు.