Ezekiel 26:17 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వారు నిన్నుగూర్చి అంగలార్పు వచన మెత్తి ఈలాగున అందురుసముద్ర నివాసమైనదానా, ఖ్యాతినొందిన పట్ణణమా, నీవెట్లు నాశనమైతివి? సముద్ర ప్రయాణము చేయుటవలన దానికిని దాని నివాసులకును బలము కలిగెను, సముద్రవాసులందరిని భీతిల్లచేసినది ఇదే.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నిన్ను గురించి వారు ఈ విషాద గీతిక పాడుతారు: “‘ఒహో తూరూ, నీవొక ప్రసిద్ధ నగరానివి. నీలో నివసించాలని ప్రజలు సముద్రాలు దాటి వచ్చారు. నీవు చాలా ప్రఖ్యాతి చెందిన దానివి. కాని నీవు లేకుండా పోయావు! సముద్రంలో నీవు బలమైనదానవు. నీలాగే నీలో నివసించిన ప్రజలు కూడా బలిష్ఠులు. నీ ముఖ్య భూమిలో నివసించే ప్రజలు నీవంటే భయపడేలా చేశావు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు నిన్నుగూర్చి అంగలార్పు వచన మెత్తి ఈలాగున అందురు–సముద్ర నివాసమైనదానా, ఖ్యాతినొందిన పట్ణణమా, నీవెట్లు నాశనమైతివి? సముద్ర ప్రయాణము చేయుటవలన దానికిని దాని నివాసులకును బలము కలిగెను, సముద్రవాసులందరిని భీతిల్లచేసినది ఇదే.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీ గురించి విలాప గీతం ఎత్తి ఇలా పాడతారు: “ ‘సముద్ర ప్రజలతో నిండిన గొప్ప పట్టణమా! నీవెలా నాశనమైపోయావు! నీవు నీ నివాసులు సముద్రాల మీద బలవంతులుగా ఉన్నారు, అక్కడ నివసించిన వారందరిపై నీవు నీ భయాన్ని ఉంచావు.