Ezekiel 27:7 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపలు ఐగుప్తునుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసె నారబట్టతో చేయ బడును; ఎలీషాద్వీపములనుండి వచ్చిన నీలధూమ్ర వర్ణములు గల బట్ట నీవు చాందినిగా కప్పుకొందువు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈజిప్టు నుండి తెచ్చిన రంగు రంగుల నారబట్టలు నీ తెరచాపలుగా ఉపయోగించారు. ఆ తెరచాపయే నీ పతాకం. నీ గది తెరలు నీలం, ఊదా రంగులను కలిగి ఉన్నాయి. అవి ఎలిషా (సైప్రస్) ద్వీపంనుండి వచ్చినవి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపలు ఐగుప్తునుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసె నారబట్టతో చేయబడును; ఎలీషాద్వీపములనుండి వచ్చిన నీలధూమ్ర వర్ణములుగల బట్ట నీవు చాందినిగా కప్పుకొందువు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఈజిప్టు నుండి వచ్చిన కుట్టుపని చేసిన సన్నని నార నీ తెరచాపగా జెండాగా పని చేశాయి; ఎలీషా తీరాల నుండి తెచ్చిన నీలం ఊదా రంగుల బట్ట నీ అంతస్తుల పైకప్పులు.