Ezekiel 28:22 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని, నీ మధ్యను ఘనత నొందుదును, నేను దాని మధ్య తీర్పుతీర్చుచు దానిని బట్టి నన్ను పరిశుద్ధ పరచు కొనగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసి కొందురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ రకంగా చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “‘సీదోనూ, నేను నీకు వ్యతిరేకిని! నీ ప్రజలు నన్ను గౌరవించటం నేర్చుకుంటారు! నేను సీదోనును శిక్షిస్తాను. ప్రజలు నేనే యెహోవానని అప్పుడు తెలుసుకుంటారు. నేను పవిత్రుడనని వారు నేర్చుకుని నన్ను ఆ విధంగా చూసుకుంటారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని, నీమధ్యను ఘనత నొందుదును, నేను దాని మధ్య తీర్పుతీర్చుచు దానినిబట్టి నన్ను పరిశుద్ధపరచు కొనగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసి కొందురు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: “ ‘సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని, నీ మధ్య నేను ఘనత పొందుతాను. నేను నీకు శిక్ష విధించి నీలో నా పరిశుద్ధతను కనుపరిచినప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.