Ezekiel 30:13 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడువిగ్రహములను నిర్మూలముచేసి, నొపులో ఒక బొమ్మలేకుండ చేసెదను, ఇక ఐగుప్తుదేశములో అధి పతిగా ఉండుట కెవడును లేకపోవును, ఐగుప్తుదేశములో భయము పుట్టించెదను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఈజిప్టులో ఉన్న విగ్రహాలను కూడా నేను నాశనం చేస్తాను. మెంఫిస్ (నొపు)లో ఉన్న విగ్రహాలన్నిటినీ తొలగిస్తాను. ఈజిప్టులో ఇక ఎంత మాత్రం నాయకుడెవడు ఉండడు. ఈజిప్టు రాజ్యంలో భయాన్ని పుట్టిస్తాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–విగ్రహములను నిర్మూలముచేసి, నొపులో ఒక బొమ్మలేకుండ చేసెదను, ఇక ఐగుప్తుదేశములో అధిపతిగా ఉండుట కెవడును లేకపోవును, ఐగుప్తుదేశములో భయము పుట్టించెదను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: “ ‘విగ్రహాలను నాశనం చేసి మెంఫిసులో ఒక్క విగ్రహం కూడా మిగలకుండా చేస్తాను. ఈజిప్టు దేశంలో ఒక్క యువరాజు కూడా ఉండడు, ఆ దేశమంతా భయం పుట్టిస్తాను.