Ezekiel 31:7 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఈలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దానివేరు విస్తార జలమున్న చోట పారుటవలన అది మిక్కిలి గొప్పదై కంటికి అంద మైన దాయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ విధంగా ఆ చెట్టు తన గొప్పతనంలోను, తన పొడవైన కొమ్మలతోను, ఎంతో ఆందంగా కన్పించింది. ఎందువల్ల ననగా దానివేళ్ళు నీరు బాగా అందేవరకు నాటుకున్నాయి!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఈలాగున అది పొడుగైన కొమ్మలుకలిగి దానివేరు విస్తార జలమున్న చోట పారుటవలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైన దాయెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీరు సమృద్ధిగా ఉన్న చోటికి దాని వేర్లు వ్యాపించాయి, కాబట్టి అది విస్తరించిన కొమ్మలతో ఎంతో అందంగా ఉంది.