Ezekiel 32:29 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అక్కడ ఎదోమును దాని రాజులును దాని అధిపతు లందరును ఉన్నారు; వారు పరాక్రమవంతులైనను కత్తి పాలైన వారియొద్ద ఉంచబడిరి; సున్నతిలేని వారియొద్దను పాతాళములోనికి దిగిపోయినవారియొద్దను వారును పండు కొనిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ఎదోము కూడా అక్కడ ఉన్నాడు. అతని రాజులు, ఇతర నాయకులు అతనితో అక్కడ ఉన్నారు. వారు శూరులైన సైనికులు కూడా. అయినా వారు యుద్ధంలో చనిపోయిన విదేశీయులతో పడివున్నారు. వారంతా అక్కడ పరాయి వారితో పడివున్నారు. బాగా లోతైన రంధ్రంలో ప్రజలతో వారు అక్కడ ఉన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అక్కడ ఎదోమును దాని రాజులును దాని అధిపతులందరును ఉన్నారు; వారు పరాక్రమవంతులైనను కత్తి పాలైన వారియొద్ద ఉంచబడిరి; సున్నతిలేని వారియొద్దను పాతాళములోనికి దిగిపోయినవారియొద్దను వారును పండు కొనిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“అక్కడ ఎదోము, దాని రాజులు యువరాజులు ఉన్నారు; వారికి శక్తి ఉన్నప్పటికీ, వారు ఖడ్గం చేత చంపబడినవారితో పాటు పడి ఉన్నారు. వారు సున్నతి పొందని వారితో, గొయ్యిలో దిగే వారితో పడుకుంటారు.