Ezekiel 33:24 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశములో పాడైపోయిన ఆ యా చోట్లను కాపురమున్న వారు అబ్రాహాము ఒంటరియై యీ దేశమును స్వాస్థ్య ముగా పొందెను గదా; అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్థ్యముగా ఇయ్యబడదా అని అనుకొనుచున్నారు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“నరపుత్రుడా, పాడుపడిన ఇశ్రాయేలు నగరాలలో కొందరు ఇశ్రాయేలు ప్రజలు నివసిస్తున్నారు. వారు ఇలా అంటున్నారు, ‘అబ్రాహాము ఒక్కడే ఒక్కడు. ఆయినా దేవుడు అతనికి ఈ దేశాన్నంతటినీ ఇచ్చినాడు. ఇప్పుడు మేము చాలా మంది ప్రజలమయ్యాము. కావున ఈ దేశం ఖచ్చితంగా మాకు చెందుతుంది. ఇది మా దేశం!’
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–నరపుత్రుడా, ఇశ్రాయేలుదేశములో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్నవారు–అబ్రాహాము ఒంటరియై యీ దేశమును స్వాస్థ్యముగా పొందెను గదా; అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్థ్యముగా ఇయ్యబడదా అని అనుకొనుచున్నారు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు దేశంలో శిథిలాల మధ్య నివసిస్తున్నవారు, ‘అబ్రాహాము ఒంటరిగానే ఈ దేశమంతటిని స్వాధీనపరచుకున్నాడు. కాని మనమైతే చాలామందిమి; ఖచ్చితంగా ఈ దేశం మనకు మన స్వాస్థ్యంగా ఇవ్వబడింది’ అని అంటున్నారు.