Ezekiel 33:6 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అయితే కావలి వాడు ఖడ్గము వచ్చుట చూచియు, బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన యెడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను, నేను కావలివానియొద్ద వాని ప్రాణమునుగూర్చి విచారణచేయు దును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“‘ఒకవేళ కావలివాడు శత్రుసైనికులు రావటం గమనించి కూడా బూర ఊదకపోవచ్చు. అనగా కావలివాడు ప్రజలను హెచ్చరించలేదన్నమాట. అప్పుడు శత్రువు వారిని పట్టుకొని బందీలుగా తీసుకుపోతాడు. తన పాపం కారణంగా ఒక వ్యక్తి పట్టుబడతాడు. అయినా కావలివాడు ఆ మనిషి చావుకు బాధ్యుడైవున్నాడు.’
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు, బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించినయెడల వాడు తన దోషమునుబట్టి పట్టబడినను, నేను కావలివానియొద్ద వాని ప్రాణమునుగూర్చి విచారణచేయుదును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే ఒకవేళ కావలివాడు దేశం మీదికి ఖడ్గం రావడం చూసి కూడా ప్రజలను హెచ్చరించడానికి బూర ఊదకపోతే, ఖడ్గం వచ్చి ఎవరినైనా చంపితే, చనిపోయినవారు తమ పాపాల కారణంగా చనిపోయినప్పటికి, నేను ఆ కావలివాన్ని బాధ్యున్ని చేస్తాను.’