Ezekiel 34:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నేను మంచి మేతగలచోట వాటిని మేపె దను, ఇశ్రాయేలుయొక్క ఉన్నతస్థలములమీద వాటికి దొడ్డి యేర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండు కొనును, ఇశ్రాయేలు పర్వతములమీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నేను వాటిని పచ్చిక బీళ్లకు నడిపిస్తాను. ఇశ్రాయేలు కొండలశిఖరాల పైకి అవి వెళతాయి. అవి అక్కడ పచ్చిక మేసి, మంచి ప్రదేశంలో హాయిగా పండుకొంటాయి. ఇశ్రాయేలు పర్వతాల మీద మంచి పచ్చిక భూములలో అవి మేత మేస్తాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను మంచి మేతగలచోట వాటిని మేపెదను, ఇశ్రాయేలుయొక్క ఉన్నతస్థలములమీద వాటికి దొడ్డి యేర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండు కొనును, ఇశ్రాయేలు పర్వతములమీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మంచి పచ్చిక ఉన్నచోట వాటిని మేపుతాను, ఇశ్రాయేలీయుల ఎత్తైన పర్వతాలు వాటికి పచ్చికబయళ్లుగా ఉంటాయి. అందులో అవి హాయిగా పడుకుంటాయి. ఇశ్రాయేలు పర్వతాలమీద శ్రేష్ఠమైన మేత ఉన్న స్థలాల్లో అవి మేస్తాయి.