Ezekiel 34:18 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
విశేషముగా మేతమేసి మిగిలిన దానిని కాళ్లతో త్రొక్కుట మీకు చాలదా?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సారవంతమైన భూముల్లో పెరిగే గడ్డిని మీరు తినవచ్చు. అటువంటప్పుడు ఇతర గొర్రెలు మేసే గడ్డిని మీలో కొందరు మీ కాళ్లతో ఎందుకు తొక్కి పాడుచేస్తారు? మీరు స్వచ్ఛమైన నీటిని కావలసినంత తాగవచ్చు! అలా కాకుండా ఇతర గొర్రెలు తాగదల్చుకున్న నీటిని కూడా మీరెందుకు కెలికి మురికి చేస్తున్నారు?
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
విశేషముగా మేతమేసి మిగిలిన దానిని కాళ్లతో త్రొక్కుట మీకు చాలదా?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మంచి పచ్చికబయళ్లను తింటే సరిపోదా? మిగిలిన పచ్చికబయళ్లను కాళ్లతో త్రొక్కాలా? మీరూ స్వచ్ఛమైన నీరు త్రాగితే సరిపోదా? మీ పాదాలతో మిగిలిన నీటిని బురదమయం చేయాలా?