Ezekiel 35:11 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నా జీవముతోడు నీవు వారి యెడల పట్టిన పగవలన వారికి చూపిన అసూయచొప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పనిచేసి, నిన్ను శిక్షించుటవలన వారికి నన్ను నేనే తెలియపరచుకొందును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు, “నీవు నా ప్రజల పట్ల అసూయచెంది ఉన్నావు. నీవు వారిపట్ల కోపంతో ఉన్నావు. నీవు వారిని అసహ్యించుకున్నావు. నీవు వారిని బాధించిన విధంగా నేను నిన్ను శిక్షిస్తానని నామీద ప్రమాణం చేసి చెపుతున్నాను! నేను నిన్ను శిక్షించి, నేను నా ప్రజలతోనే ఉన్నానని వారు తెలుసుకొనేలా చేస్తాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా జీవముతోడు నీవు వారి యెడల పెట్టిన పగవలన వారికి చూపిన అసూయచొప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పనిచేసి, నిన్ను శిక్షించుటవలన వారికి నన్ను నేనే తెలియపరచుకొందును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి నా జీవం తోడు నీవు వారిమీద ద్వేషంతో నీవు వారికి చూపించిన కోపం అసూయను బట్టి నేను నీ పట్ల తగిన రీతిగా వ్యవహరిస్తాను. నేను నిన్ను శిక్షించినప్పుడు నన్ను నేను వారికి పరిచయం చేసుకుంటాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.