Ezekiel 36:12 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మానవజాతిని, అనగా నా జను లగు ఇశ్రాయేలీయులను నేను మీలో సంచారము చేయించెదను, వారు నిన్ను స్వతంత్రించుకొందురు, మీ రికమీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యమగుదురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అవును, నా ప్రజలైన, ఇశ్రాయేలీయులను ఈ భూమి వద్దకు నడిపిస్తాను. వారు మిమ్మల్ని వశపర్చుకుంటారు. మీరు వారి సొత్తు అవుతారు. మరెన్నడూ వారికి పిల్లలు లేకుండా మీరు చేయలేరు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మానవజాతిని, అనగా నా జనులగు ఇశ్రాయేలీయులను నేను మీలో సంచారము చేయించెదను, వారు నిన్ను స్వతంత్రించుకొందురు, మీ రికమీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యమగుదురు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను మనుష్యజాతిని అనగా నా ప్రజలైన ఇశ్రాయేలీయులను మీమీద నివసించేలా చేస్తాను. వారు మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటారు, మీరు వారికి స్వాస్థ్యంగా ఉంటారు; ఇక ఎప్పటికీ మీరు వారిని పిల్లలు లేనివారిగా చేయరు.