Ezekiel 36:20 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
వారు తాము వెళ్లిన స్థలముల లోని జనులయొద్ద చేరగా ఆ జనులువీరు యెహోవా జనులే గదా, ఆయన దేశములోనుండి వచ్చినవారే గదా, అని చెప్పుటవలన నా పరిశుద్ధనామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వారు అన్యదేశాలకు వెళ్లారు. ఆయా దేశాలలో కూడ వారు నా మంచి పేరును పాడుచేశారు. ఎలాగనగా, ఆ దేశస్థులు కూడ వీరిని గురించి మాట్లాడారు. ‘యెహోవా ఎటువంటి దేవుడు? వీరు యెహోవా ప్రజలు. అయినా వీరు తమ దేశాన్ని వదిలి వచ్చారు’ అని వారన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు తాము వెళ్లిన స్థలములలోని జనులయొద్ద చేరగా ఆ జనులు–వీరు యెహోవా జనులే గదా, ఆయన దేశములోనుండి వచ్చినవారే గదా, అని చెప్పుటవలన నా పరిశుద్ధనామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు ఏ దేశాల మధ్యకు వెళ్లినా నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేశారు, ఎలా అంటే, ‘వారు యెహోవా ప్రజలే అయినప్పటికీ వారు ఆయన దేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది’ అని వారి గురించి చెప్తారు.