Ezekiel 36:22 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటనచేయుముప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగాఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీచేత దూషణనొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవుదానిని చేయుదును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కావున ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని ఇశ్రాయేలు వంశానికి చెప్పు, ‘ఇశ్రాయేలు వంశీయులారా, మీరు వెళ్లిన ప్రతిచోటా నా పవిత్ర నామాన్ని పాడుచేశారు. దీనిని ఆపటానికి నేనేదైనా చేయదలిచాను. ఇశ్రాయేలూ, అది నేను నీ కొరకు మాత్రం చేయను. నా పవిత్ర నామం కొరకు నేను ఆ పని చేస్తాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటనచేయుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీచేత దూషణనొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవుదానిని చేయుదును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“కాబట్టి ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలు ప్రజలారా, నేను చేయబోయేది మీ కోసం కాదు, ఇతర ప్రజల్లో మీ వలన అవమానానికి గురియైన నా పరిశుద్ధ నామం కోసమే చేస్తాను.