Ezekiel 37:11 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అప్పుడాయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, ఈ యెముకలు ఇశ్రాయేలీయులనందరిని సూచించుచున్నవి. వారుమన యెముకలు ఎండి పోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమై పోతివిు అని యనుకొనుచున్నారు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
తరువాత నా ప్రభువైన యెహోవా నాతో ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, ఈ ఎముకలు మొత్తం ఇశ్రాయేలు వంశంలా ఉన్నాయి. ఇశ్రాయేలీయులు, ‘మా ఎముకలు ఎండిపోయాయి. మా ఆశలు అడుగంటాయి. మేము సర్వనాశనమయ్యాము!’ అని అంటున్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడాయన నాతో ఇట్లనెను —నరపుత్రుడా, ఈ యెముకలు ఇశ్రాయేలీయులనందరిని సూచించుచున్నవి. వారు — మన యెముకలు ఎండి పోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమై పోతిమి అని యనుకొనుచున్నారు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆయన నాతో ఇలా అన్నారు: “మనుష్యకుమారుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు ప్రజలు. వారు, ‘మా ఎముకలు ఎండిపోయాయి, మాకు ఏ ఆశ లేదు మేము నాశనమయ్యాం’ అని అనుకుంటున్నారు.