Ezekiel 37:19 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆ రెండు తునకలను వారి సమక్ష మున నీవు చేతపట్టుకొని వారితో ఇట్లనుముప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాఎఫ్రాయిము చేతిలోనున్న తునక, అనగా ఏ తునకమీద ఇశ్రాయేలువారందరి పేళ్లును వారితోటివారి పేళ్లును నేను ఉంచితినో యోసేపు అను ఆ తునకను యూదావారి తునకను నేను పట్టుకొని యొకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసెదను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని వారికి చెప్పు. ‘ఎఫ్రాయిము చేతిలో ఉన్న యోసేపు పుల్లను మరియు అతని స్నేహితులగు ఇశ్రాయేలీయులను నేను తీసుకుంటాను. దానిని యూదా యొక్క పుల్లతో కలిపి ఒక్క పుల్లగా చేస్తాను. నా చేతిలో అవి ఒక్క కట్టె పుల్ల అవుతాయి!’
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ రెండు తునకలను వారి సమక్షమున నీవు చేతపట్టుకొని వారితో ఇట్లనుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఎఫ్రాయిము చేతిలో నున్న తునక, అనగా ఏ తునకమీద ఇశ్రాయేలువారందరి పేళ్లును వారితోటివారి పేళ్లును నేను ఉంచితినో యోసేపు అను ఆ తునకను యూదావారి తునకను నేను పట్టుకొని యొకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసెదను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేను ఎఫ్రాయిం చేతిలో ఉన్న యోసేపు కర్రను, అతనితో సంబంధం ఉన్న ఇశ్రాయేలీయుల గోత్రాలను తీసుకుని యూదా కర్రకు జతచేయబోతున్నాను. నేను వాటిని ఒకే కర్రలా చేస్తాను, అవి నా చేతిలో ఒకటిగా అవుతాయి.’