Ezekiel 38:12 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై, పూర్వము పాడై మరల నివసింపబడిన స్థలములమీదికి తిరిగి పోయెదను, ఆ యా జనములలోనుండి సమకూర్చబడి, పశువులును సరకులును గలిగి, భూమి నట్టనడుమ నివసించు జనుల మీదికి తిరిగి పోయెదను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ ప్రజలను నేను ఓడించి, వారి విలువైన సొమ్ములను నేను కొల్లగొడతాను. ఒకప్పుడు నాశనం చేయబడి, ఇప్పుడు జనంతో క్రిక్కిరిసిన ప్రాంతాలపై నేను యుద్ధం చేస్తాను. అన్యదేశాల నుండి వెనుకకు తీసుకొని రాబడిన ఆ ప్రజలతో (ఇశ్రాయేలు) నేను యుద్ధం చేస్తాను. ఇప్పుడా ప్రజలకు పశువులు, ఆస్తిపాస్తులు సమకూడాయి. వారు ప్రపంచానికి నాలుగుబాటల కూడలి స్థలంలో నివసిస్తున్నారు. కొన్ని అగ్ర రాజ్యాలు ఇతర బలమైన రాజ్యాలకు ఆ ప్రాంతం గుండానే వెళ్లాలి.’
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై, పూర్వము పాడై మరల నివసింపబడిన స్థలములమీదికి తిరిగి పోయెదను, ఆయా జనములలోనుండి సమకూర్చబడి, పశువులును సరకులునుగలిగి, భూమి నట్టనడుమ నివసించు జనులమీదికి తిరిగి పోయెదను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారిని దోచుకుని సొమ్ము కొల్లగొట్టడానికి, గతంలో పాడుబడి ఉన్నా మళ్ళీ నివాసం ఉంటున్న స్థలాల మీద దాడి చేయడానికి, ఇతర జనాల్లో నుండి సమకూర్చబడి సమృద్ధిగా పశువులు సరుకులు కలిగి భూమి మధ్యభాగంలో నివసించే ప్రజలమీదికి వెళ్తాను.”