Ezekiel 38:16 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులగు నా జనులమీద పడెదరు; అంత్య దినములందు అది సంభవించును, అన్యజనులు నన్ను తెలిసి కొనునట్లు నిన్నుబట్టి వారి యెదుట నన్ను నేను పరిశుద్ధ పరచుకొను సమయమున, గోగూ, నేను నా దేశము మీదికి నిన్ను రప్పించెదను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేయటానికి మీరు వస్తారు. దేశాన్ని ఆవరించే గర్జించే ఒక మేఘంలా నీవుంటావు. ఆ సమయం వచ్చినప్పుడు నా దేశం మీద యూద్ధానికి నిన్ను తీసుకొనివస్తాను. గోగూ, అప్పుడు నేనెంత శక్తిమంతుడనో దేశాలన్నీ తెలుసుకొంటాయి! వారు నన్ను గౌరవించటం నేర్చుకుంటారు. నేను మహనీయుడనని వారు తెలుసుకుంటారు. నీకు నేనేమి చేస్తానో వారు చూస్తారు!’”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులగు నా జనులమీద పడెదరు; అంత్య దినములందు అది సంభవించును, అన్యజనులు నన్ను తెలిసి కొనునట్లు నిన్నుబట్టి వారి యెదుట నన్ను నేను పరిశుద్ధపరచుకొను సమయమున, గోగూ, నేను నా దేశము మీదికి నిన్ను రప్పించెదను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేశాన్ని మేఘం క్రమ్మినట్లు మీరంతా నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీదికి వస్తారు. రాబోయే రోజుల్లో అది జరుగుతుంది; నీ ద్వారా ఇతర ప్రజల ఎదుట నేను పరిశుద్ధుడను అని కనుపరిచినప్పుడు వారు నన్ను తెలుసుకునేలా గోగూ, నేను నిన్ను నా దేశం మీదికి రప్పిస్తాను.