Ezekiel 38:21 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పించెదను, ప్రతివాని ఖడ్గము వాని సహోదరునిమీద పడును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “అంతేగాదు. ఇశ్రాయేలు పర్వతాల మీద అన్ని రకాల భయోత్పాతాలను గోగు మీదికి రప్పిస్తాను. అతని సైనికులు తమ కంగారులో ఒకరిపై ఒకరు పడి, తమ కత్తులతో ఒకరి నొకరు పొడుచుకొని చంపుకుంటారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా పర్వతములన్నిటిలో అతనిమీదికి ఖడ్గము రప్పించెదను, ప్రతివాని ఖడ్గము వాని సహోదరునిమీద పడును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను నా పర్వతాలన్నిటిపైన గోగుకు వ్యతిరేకంగా ఖడ్గాన్ని రప్పిస్తాను. ప్రతి ఒక్కని ఖడ్గం తన సోదరుని మీద పడుతుంది అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.