Ezekiel 39:10 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
వారు పొలములో కట్టెలు ఏరుకొనకయు అడవులలో మ్రానులు నరుకకయునుండి, ఆయుధములు పొయ్యిలో కాల్చు చుందురు, తమ్మును దోచుకొనినవారిని తామే దోచుకొందురు, తమ సొమ్ము కొల్ల పెట్టినవారి సొమ్ము తామే కొల్ల పెట్టుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ ఆయుధాలనే వారు వంట చెరకుగా ఉపయోగించటంతో వారు పొలాల్లో పుల్లలు ఏరటం గాని, అడవిలో కట్టెలు కొట్టటం గాని చేయవలసిన అవసరం లేదు. వారిని దోచుకోవాలని వచ్చిన సైనికుల నుండి విలువైన వస్తువులను వారే తీసుకుంటారు. తమవద్ద విలువైన వస్తువులను దోచుకున్న సైనికుల నుండి వారే మంచి వస్తువులను తీసుకుంటారు.” ఈ విషయాలు నా ప్రభువైన యెహోవా చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు పొలములో కట్టెలు ఏరుకొనకయు అడవులలో మ్రానులు నరుకకయునుండి, ఆయుధములు పొయ్యిలో కాల్చు చుందురు, తమ్మును దోచుకొనినవారిని తామే దోచుకొందురు, తమ సొమ్ము కొల్లపెట్టినవారి సొమ్ము తామే కొల్లపట్టుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు పొలంలో కట్టెలు ఏరుకోకుండా అడవిలో చెట్లు నరకకుండా ఆయుధాలను పొయ్యిలో కాలుస్తారు. వారు తమను దోచుకున్న వారిని తిరిగి దోచుకుంటారు. తమను కొల్లగొట్టిన వారిని తిరిగి కొల్లగొడతారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.