Ezekiel 39:7 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నేను యెహోవానై యున్నానని అన్యజనులు తెలిసికొనునట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగనియ్యక, నా జనులగు ఇశ్రాయేలీయుల మధ్య దానిని బయలుపరచెదను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నేనొక్కడినే ఇశ్రాయేలులో మహనీయుణ్ణి. ప్రజలు నా పవిత్ర నామాన్ని ఇక ఎంతమాత్రం పాడు చేయకుండా చూస్తాను. దేశాలన్నీ నేనే యెహోవానని తెలుసుకుంటాయి. నేను ఇశ్రాయేలులో నెలకొన్న పవిత్రుడినైన యెహోవానని వారు తెలుసుకుంటారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను యెహోవానై యున్నానని అన్యజనులు తెలిసికొనునట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగనియ్యక, నా జనులగు ఇశ్రాయేలీయులమధ్య దానిని బయలుపరచెదను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ ‘నా పరిశుద్ధ నామాన్ని నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య వెల్లడి చేస్తాను. ఇకపై నా పరిశుద్ధ నామం అవమానానికి గురి కానివ్వను, అప్పుడు నేనే యెహోవానని ఇశ్రాయేలులో పరిశుద్ధుడనని ఇతర దేశాల ప్రజలు తెలుసుకుంటారు.