Ezekiel 4:6 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆ దినములు గడచిన తరువాత కుడిప్రక్కను పండుకొనియుండి నలు వది దినములు యూదావారి దోషమును భరింపవలెను, సంవత్సర మొకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణ యించి యున్నాను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ఆ తరువాత నీవు కుడి ప్రక్కకి తిరిగి నలభై రోజులు పడుకోవాలి. ఈసారి నీవు యూదావారి పాపాలను నలభై రోజులపాటు భరిస్తావు. ఒక రోజు ఒక సంవత్సరానికి సమానం. యూదా ఎంతకాలం శిక్షింపబడాలో నేను నీకు ఈ విధంగా తెలియజేస్తున్నాను.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ దినములు గడచిన తరువాత కుడిప్రక్కను పండుకొనియుండి నలువది దినములు యూదావారి దోషమును భరింపవలెను, సంవత్సర మొకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణ యించియున్నాను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నీవు ఇది పూర్తి చేసిన తర్వాత, ఈసారి నీ కుడి వైపుకు తిరిగి పడుకుని యూదా ప్రజల పాపాన్ని భరించు. నేను నీకు 40 రోజులు, ప్రతి సంవత్సరానికి ఒక రోజు నియమించాను.