Ezekiel 40:24 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అతడు నన్ను దక్షి ణపుతట్టునకు తోడుకొని పోగా దక్షిణపుతట్టున గుమ్మ మొకటి కనబడెను. దాని స్తంభములను మధ్యగోడలను కొలువగా అదే కొలత కనబడెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
పిమ్మట ఆ మనిషి నన్ను దక్షిణానికి తీసుకొని వెళ్లాడు. అక్కడ నేను దక్షిణ ద్వారం చూశాను. అతడు ద్వారపు కమ్మీలను, మండపాన్ని కొలిచాడు. ఈ కొలతలు ఇతర ద్వారాల కొలతల మాదిరిగానే ఉన్నాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు నన్ను దక్షి ణపుతట్టునకు తోడుకొని పోగా దక్షిణపుతట్టున గుమ్మ మొకటి కనబడెను. దాని స్తంభములను మధ్యగోడలను కొలువగా అదే కొలత కనబడెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడతడు నన్ను దక్షిణం వైపుకు తీసుకెళ్లగా అక్కడ దక్షిణ ద్వారం కనిపించింది. దాని ద్వారబంధాలను మధ్య గోడలను కొలిచినప్పుడు దీని కొలత ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే.