Ezekiel 40:29 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మరియు దాని కావలిగదులును స్తంభ ములును మధ్య గోడలును పైచెప్పిన కొలతకు సరిపడెను; దానికిని దాని చుట్టు ఉన్న మధ్యగోడలకును కిటికీలుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరు వదియైదు మూరలు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దక్షిణ ద్వారపు గదులు, దాని ద్వారపు కమ్మీలు, దాని మండపం కొలతలు కూడ ఇతర గుమ్మాల కొలతలవలెనే ఉన్నాయి. ద్వారానికి, మండపానికి చుట్టూ కిటికీలున్నాయి. ద్వారం పొడవు ఏభై మూరలు, వెడల్పు ఇరవై ఐదు మూరలు ఉన్నాయి. లోపలి ఆవరణ చుట్టూ మండపాలున్నాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు దాని కావలిగదులును స్తంభములును మధ్య గోడలును పైచెప్పిన కొలతకు సరిపడెను; దానికిని దాని చుట్టు ఉన్న మధ్యగోడలకును కిటికీ లుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరువదియైదు మూరలు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దాని కాపలా గదులు ద్వారబంధాలు వాటి మధ్య గోడల కొలతలు మిగతా వాటి కొలతలు ఒక్కటే. దానికి చుట్టూ ఉన్న మధ్యగోడలకు కిటికీలు ఉన్నాయి. దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది.