Ezekiel 40:42 — Compare Translations
3 translations compared side by side
Telugu (BSI) 1880
అవి మూరెడున్నర నిడి వియు మూరెడున్నర వెడల్పును మూరెడు ఎత్తును గలిగి మలిచిన రాతితో చేయబడి యుండెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దహన బలుల నిమిత్తం నాలుగు చెక్కిన రాతి బల్లలు ఉన్నాయి. ఈ బల్లలు ఒక్కొక్కటి రెండడుగుల ఏడున్నర అంగుళాల పొడవు; రెండడుగుల ఏడున్నర అంగుళాల వెడల్పు; ఒక అడుగు తొమ్మిది అంగుళాల ఎత్తు కలిగి ఉన్నాయి. దహన బలులకు, ఇతర బలులకు వినియోగించే జంతువులను చంపటానికి తగిన పనిముట్లను యాజకులు ఈ బల్లల మీదనే ఉంచుతారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అంతే కాకుండా దహనబలుల కోసం చెక్కిన రాతితో చేసిన నాలుగు బల్లలు ఉన్నాయి; వాటి పొడవు మూరన్నర వెడల్పు మూరన్నర ఎత్తు ఒక మూర. దహనబలులు ఇతర బలులు వధించడానికి ఉపయోగించే పాత్రలు వాటిపై ఉంచారు.