Ezekiel 42:13 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అప్పుడాయన నాతో ఇట్లనెను విడిచోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులును దక్షిణపుగదులును ప్రతిష్ఠితములైనవి, వాటి లోనే యెహోవా సన్నిధికి వచ్చు యాజకులు అతిపరిశుద్ధ వస్తు వులను భుజించెదరు, అక్కడ వారు అతిపరిశుద్ధ వస్తువులను, అనగా నైవేద్యమును పాపపరిహారార్థ బలిపశుమాంసమును అపరాధపరిహారార్థ బలిపశుమాంసమును ఉంచెదరు, ఆ స్థలము అతిపరిశుద్ధము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ మనిషి నాతో ఇలా అన్నాడు: “నియమిత స్థలానికి అడ్డంగా ఉన్న ఉత్తర గదులు, దక్షిణ గదులు పవిత్రమైనవి. యెహోవాకు బలులు సమర్పించే యాజకులకు ఈ గదులు కేటాయించబడ్డాయి. ఆ యాజకులు అతి పవిత్ర అర్పణలను ఈ గదులలోనే తింటారు. అతి పవిత్ర అర్పణలను వారక్కడ ఉంచుతారు. ఎందుకంటే, ఈ స్థలం పవిత్రమైనది. అతి పవిత్ర అర్పణలు ఏమంటే: ధాన్యపు నైవేద్యాలు, తప్పులను పరిహరించు బలులు మరియు అపరాధ పరిహారార్థ బలులు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడాయన నాతో ఇట్లనెను — విడిచోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులును దక్షిణపుగదులును ప్రతిష్ఠితములైనవి, వాటి లోనే యెహోవా సన్నిధికి వచ్చు యాజకులు అతిపరిశుద్ధ వస్తువులను భుజించెదరు, అక్కడ వారు అతిపరిశుద్ధ వస్తువులను, అనగా నైవేద్యమును పాపపరిహారార్థబలిపశు మాంసమును అపరాధపరిహారార్థబలిపశుమాంసమును ఉంచెదరు, ఆ స్థలము అతిపరిశుద్ధము.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడతడు నాతో ఇలా అన్నాడు, “ఆలయ ఆవరణానికి ఎదురుగా ఉత్తర గదులు, దక్షిణ గదులు యాజకులకు చెందినవి; అక్కడ యెహోవా సన్నిధికి వచ్చే యాజకులు అతి పరిశుద్ధ అర్పణలను తింటారు. అక్కడే వారు అతి పరిశుద్ధ అర్పణలను అనగా భోజనార్పణలు, పాపపరిహార బలులు, అపరాధబలులను ఉంచుతారు. ఆ స్థలం అతిపరిశుద్ధమైనది.