Ezekiel 44:11 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అయినను వారు నా పరిశుద్ధస్థల ములో పరిచర్యచేయువారు, నా మందిరమునకు ద్వార పాలకులై మందిర పరిచర్య జరిగించువారు, ప్రజలకు బదులుగా వారే దహనబలి పశువులను బలి పశువులను వధించువారు, పరిచర్యచేయుటకై వారే జనుల సమక్ష మున నియమింపబడినవారు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నా పవిత్ర స్థలంలో సేవ చేయటానికి లేవీయులు ఎంపిక చేయబడ్డారు. ఆలయ ద్వారాలకు వారు కాపలా ఉన్నారు. వారు ఆలయంలో సేవ చేశారు. ప్రజల తరఫున బలులు దహన బలులు ఇవ్వటానికి వారు జంతువులను వధించారు. ప్రజలకు సహాయం చేయటానికి, వాళ్ళకు సేవ చేయటానికి వారు ఎంపిక చేయబడ్డారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయినను వారు నా పరిశుద్ధస్థలములో పరిచర్యచేయువారు, నా మందిరమునకు ద్వారపాలకులై మందిర పరిచర్య జరిగించువారు, ప్రజలకు బదులుగా వారే దహనబలి పశువులను బలి పశువులను వధించువారు, పరిచర్యచేయుటకై వారే జనుల సమక్షమున నియమింపబడినవారు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు నా పరిశుద్ధ స్థలంలో సేవ చేశారు, ఆలయ ద్వారపాలకులుగా బాధ్యత వహించి సేవ చేశారు; వారు ప్రజల కోసం దహనబలులను బలులను వధించి ప్రజల ముందు నిలబడి వారికి సేవ చేశారు.