Ezekiel 44:12 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
విగ్రహముల ఎదుట జను లకు పరిచారకులై ఇశ్రాయేలీయులు తొట్రిల్లి పాపము చేయుటకు వారు కారకులైరి గనుక నేను వారికి విరోధి నైతిని; వారు తమ దోషమును భరించుదురు; ఇదే ప్రభు వైన యెహోవా వాక్కు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కాని ప్రజలు నాపట్ల పాపం చేయటానికే లేవీయులు వారికి సహాయపడ్డారు! ప్రజల విగ్రహారాధనలో లేవీయులు వారికి సహాయపడ్డారు! కనుక నేను వారికి వ్యతిరేకంగా ఇలా ప్రతిజ్ఞ చేస్తున్నాను, ‘వారు తమ పాపానికి శిక్షింపబడతారు.’” నా ప్రభువైన యెహోవా ఇది చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలీయులు తొట్రిల్లి పాపము చేయుటకు వారు కారకులైరి గనుక నేను వారికి విరోధి నైతిని; వారు తమ దోషమును భరించుదురు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కానీ వారు తమ విగ్రహాల సమక్షంలో వారికి సేవ చేసి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారణమయ్యారు కాబట్టి వారు తమ పాప దోషాన్ని భరించేలా నేను వారికి వ్యతిరేకంగా నా చేయెత్తాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.