Ezekiel 45:25 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మరియు ఏడవ నెల పదునైదవ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు ఏడు దినములు పండుగ ఆచరించుచు పాప పరిహారార్థబలి విషయములోను దహనబలివిషయములోను నైవేద్య విషయములోను నూనె విషయములోను ఆ ప్రకారముగానే చేయవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
పాలకుడు పర్ణశాలల పండుగ జరిపే ఏడు రోజులలోనూ ఇదే విధంగా తప్పక చేయాలి. ఈ పండుగ ఏడవ నెలలో పదిహేనవ రోజున మొదలవుతుంది. ఇవన్నీ పాపపరిహారార్థ అర్పణలు, దహన బలులు, ధాన్యార్పణలు, నూనె అర్పణలుగా పరిగణింపబడుతాయి.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు ఏడవ నెల పదునైదవదినమున పండుగ జరుగుచుండగా యాజకుడు ఏడు దినములు పండుగ ఆచరించుచు పాప పరిహారార్థబలి విషయములోను దహనబలివిషయములోను నైవేద్య విషయములోను నూనె విషయములోను ఆప్రకారముగానే చేయవలెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ ‘ఏడవ నెలలో పదిహేనవ రోజున ప్రారంభమయ్యే పండుగ యొక్క ఏడు రోజుల్లో కూడా అతడు పాపపరిహార బలులు, దహనబలులు, భోజనార్పణలు, నూనెను అదే విధంగా ఏర్పాటు చేయాలి.