Ezekiel 46:16 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా అధిపతి తన కుమారులలో ఎవనికైనను భూమి ఇచ్చిన యెడల అది యతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారుల దగును. అది వారసత్వమువలన వచ్చిన దానివంటి స్వాస్థ్యము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “రాజ్యాధిపతి తన కుమారులలో ఎవరికైనా తన భూమిలో కొంత భాగం కానుకగా ఇస్తే అది అతని కుమారులకు చెందుతుంది. అది వారి ఆస్తి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–అధిపతి తన కుమారులలో ఎవనికైనను భూమి ఇచ్చినయెడల అది యతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారుల దగును. అది వారసత్వమువలన వచ్చిన దానివంటి స్వాస్థ్యము.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అధిపతి వారసత్వంగా పొందిన భూమిలో ఒక భాగం తన కొడుక్కు ఇస్తే అది అతనికే సంక్రమిస్తుంది. ఇది వారసత్వ నియమము.